ఐసీఎంఆర్ స‌ర్వ‌ర్‌పై కన్నేసిన హ్యాకర్లు... 6000 వేల సార్లు దాడి... అయితే...

సోషల్ మీడియా ఖాతాలు అయిపోయాయి. ఇప్పుడు హ్యాకర్లు (Hackers attack) ఇప్పుడు ఆస్పత్రుల వెబ్‌సైట్‌ల పడ్డారు. ఎయిమ్స్ వెబ్‌సైట్‌ను చేజిక్కించుకుని డేటా కాజేశారు. ఇప్పుడు మరో సంచలనమైన విషయం వెలుగులోకి వచ్చింది. నవంబర్ నెలలో ఐసీఎంఆర్ స‌ర్వ‌ర్‌ను కూడా టార్గెట్ చేసినట్టు తెలిసింది. ఒకేరోజు 6000 సార్లు దాడి చేశారు. కానీ హ్యాకర్లు ప్రయత్నం ఫలించలేదు. ఈ విషయన్నా ఐసీఎమ్మార్ అధికారి ఒకరు చెప్పారు. అయితే 2020 నుంచి ఈ దాడులు జరుగుతున్నాయంట.

ఐసీఎంఆర్ స‌ర్వ‌ర్‌పై కన్నేసిన హ్యాకర్లు... 6000 వేల సార్లు దాడి... అయితే...
: హ్యాకర్లు ఇప్పుడు ఆస్పత్రుల వెబ్‌సైట్లపై పడ్డారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన విషయం బయటపడింది. నవంబర్ నెలలో ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్‌ మెడిక‌ల్ రీసెర్చ్ () వెబ్‌సైట్ స‌ర్వ‌ర్‌ను హ్యాక్ చేయ‌డానికి నానా తంటాలు పడ్డారంట. ఏకంగా రోజంతా ప్రయత్నించారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఐసీఎంఆర్ వెబ్‌సైట్ ల‌క్ష్యంగా హ్యాక‌ర్లు ఒకే రోజు ఆరు వేల సార్లు ప్రయత్నించారని మంగ‌ళ‌వారం జాతీయ స‌మాచార కేంద్రం అధికారి ఒక‌రు తెలియజేశారు. నవంబర్‌లో సైబర్ అటాక్ జరిగిందని, మా సర్వర్ కూడా ఒకే రోజు డౌన్ అయింది. కానీ డేటా సురక్షితంగా ఉందని ఆయన చెప్పారు. నవంబర్ 30వ తేదీన హాంకాంగ్‌కు చెందిన హ్యాకర్లు ఐసీఎంఆర్ వెబ్‌సైట్‌ని హ్యాక్ చేయడానికి ట్రై చేశారట. వాళ్లు బ్లాక్ చేసిన‌ ఐపీ (IP address 103.152.220.133) అడ్రస్‌తో సర్వర్‌ని హ్యాక్ చేయాలని ప్రయత్నించారు. అయితే వాళ్ల ప్రయత్నం ఫలించ లేదు. వెంటనే సెక్యూరిటీ అధికారుల‌కు విష‌యం తెలియజేశారు. ఒక వేళ హ్యాకర్లు విజయం సాధించి ఉంటే విలువైన సమాచారం వాళ్ల చేతుల్లో పడేది. దాంతో ఏం చేశావరనే విషయం ఊహించలేనిది. అయితే ఐటీఎంఆర్‌పై దాడి జరగడం ఇది మొదటిసారి కాదంట. 2020 నుంచి ఐసీఎంఆర్ మీద సైబ‌ర్ దాడులు ఎక్కువ అయ్యాయి అని ఆ అధికారి వెల్లడించారు. కాగా నవంబర్ నెలలోనే ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్) స‌ర్వ‌ర్‌ను హ్యాక‌ర్లు చేజిక్కించుకున్నారు. దాడి చేసి డేటా చోరీ చేశారు.